పాలకొల్లు: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నానని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకున్న అవకాశాలన్నీ, వ్యక్తిగత స్వార్థానికి వాడుకోకుండా ప్రజల కోసమే వినియోగిస్తున్నానని మంత్రి నిమ్మల వెల్లడించారు. స్థానిక బి.ఆర్.అంబే బాలికలు, ఎంఎంకెఎన్ఎమ్ విద్యార్థులకు 250 సైకిళ్ళు ఉగాది రోజున ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు వివిధ మార్గాల్లో సేకరిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా, కాంటినెంటల్ కాఫీ అధినేత నుంచి సి ఎస్ ఆర్ నిధులు 50 లక్షలు నియోజకవర్గ అభివృద్ధికి తీసుకు వచ్చినట్టు తెలిపారు. యూనియన్ బ్యాంక్ వారి నుంచి 50 లక్షల రూపాయల సి ఎస్ ఆర్ నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. మొదటి విడతగా పాతిక లక్షల రూపాయలు విడుదల చేసినట్టు వెల్లడించారు. విద్య మనిషికి విచక్షణా జ్ఞానం ఇస్తుందని, ఇది మనిషి ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. విద్యాధికుడిగా, దశాబ్దం పాటు విచారణలో పనిచేసినందున, విద్య యొక్క విలువ తనకు తెలుసునన్నారు. విద్యార్థులకు విద్య అందుబాటులోకి తెచ్చేందుకు, ఈ ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 9 వ తరగతికి మాత్రమే ఇస్తున్న ఈ పథకం, ఇకపై 6 నుంచి 10వ తరగతి వరకు కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో, బాలికలతో సైకిల్ నడిపి విద్యార్థులను ఉత్సాహపరిచారు. తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషంతో మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, మాణిక్యం, వెంకన్న బాబు, విక్టర్, రాజశేఖర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్రావు, ఏం సి చైర్మన్ కోడి విజయభాస్కర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసీరావు, మామిడిశెట్టి పెద్దిరాజు, బోనం నాని, ఉన్నమట్ల కపర్ది, పద్మారావు, కొల్లి కొండ ప్రసాద్, జక్కంపూడి కుమార్, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, కర్నేని రోజా రమణి, రమేష్ రాజు, రావూరి అప్పారావు, ఎంఈఓ గుమ్మల వీరాస్వామి, గంగాధర శర్మ, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శాస్త్రి ఉపాధ్యాయులు పాల్గొన్నారు

విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేస్తున్న మంత్రి నిమ్మల మాజీ ఎమ్మెల్సీ అంగర

విద్యార్థినితో మంత్రి సైకిల్ సవారీ

సైకిల్ పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల