న్యూఢిల్లీ: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్ కాం)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ సంభాషణ మంగళవారం జరిగింది.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ఆవశ్యకతను ఈ అంశం సూచిస్తోంది. పశ్చిమ ఆసియా ఉద్రిక్త పరిస్థితి, శాంతి పునరుద్ధరణ, వాణిజ్య ఒప్పందాల పురోగతి వంటి ప్రధాన అంశాలపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించారని తెలుస్తోంది. ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని “శాంతి పునరుద్ధరణ, ఉద్రిక్తతల తీవ్రత తగ్గించే ప్రక్రియ” గా ఇరు దేశాల నేతలు సూచించారు. వివాదాల తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు కొనసాగాలని భారత్ తరఫున మోదీ స్పష్టంగా నొక్కి చెప్పారు. ఇదే కోణంలో అంతర్జాతీయ సమాజం కూడా చర్యలు తీసుకోవాలని అమెరికా వైపు నుంచి పేర్కొన్నారు.
హార్ముజ్ జల సంధి, ప్రపంచ వాణిజ్యం
తెరిచి, సురక్షితంగా ఉండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యవసరమని ఇరు దేశాలు ఓకే అభిప్రాయం వెల్లడించాయి. పెట్రోలియం రవాణాకు కీలకమైన ఈ సముద్ర మార్గంలో ఎటువంటి అభద్రత కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఇది భారత్ వంటి చమురును దిగుమతి చేసుకునే దేశాలకు వందల కోట్ల డాలర్ల ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నరు.
వాణిజ్య ఒప్పందం, రక్షణ భాగస్వామ్యం
ఫోన్ సంభాషణలో భారత్‑అమెరికా మధ్య కొంతకాలంగా జరుగుతున్న ట్రేడ్ ఇదే సమయంలో రక్షణ భాగస్వామ్యం, ఇండో‑పసిఫిక్ ప్రాంతం భద్రత, ఉగ్రవాద ముప్పు వంటి అంశాల్లో సహకారాన్ని మరింత బలపరిచే దిశగా ఇరు నేతలు సంకేతాలు పంపారు.
మోదీ‑ట్రంప్ సంబంధాల ప్రభావం
ఇప్పటికే ఇరు దేశాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది.
ప్రధాన మోడీ, ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ.
మోడీ-ట్రంప్ ఫోన్ సంభాషణ