Telugu News Power

ఫోను ముట్టుకున్నా చాలు సొమ్ము కొట్టేస్తారు. కొత్త మోసం. మీ మంచితనమే వారి పెట్టుబడి.

పాలకొల్లు: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) ఆధునిక సాంకేతికతతో, ఈ డిజిటల్ యోగంలో మానవులు ఎన్నో పనులు ఇంటి నుంచే,చిటికెలో పూర్తి చేస్తున్నారు. వాటిలో ఉన్న లొసుగులటెక్నాలజీని తమ చెప్పు చేతల్లోకి తీసుకుని,ప్రతి ఏట ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు లక్షల కోట్లు కొట్టేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న, ప్రజలు ఈ మోసాలకు గురికాక తప్పడం లేదు. చాలామంది పబ్లిక్ లో మంచివాళ్లు అనిపించుకోవాలని చాలా కుతూహల పడుతూ ఉంటారు. ఎందరికో సాయం చేయాలని తహతలాడుతారు కూడా. ఇదే బలహీనత, సైబర్ నేరస్తులకు వరంగా మారింది. మధ్య వయసు వారు, వృద్ధులు సామాన్యంగా కనిపిస్తూ, మన సహాయం కోసం చూస్తున్నట్టు నటిస్తారు. వారి దగ్గర ఉన్న ఫోను మీ చేతిలో పెట్టి, ఏమో వివరాలు చూసి పెట్టమని అడుగుతారు. మీరు చేతిలో తీసుకున్న వెంటనే మీ వేలిముద్రలు ఆ ఫోనుకు చేరిపోతాయి, అప్పటికే ఆ ఫోనులో తెరిచి ఉన్న ఫోటో మీ ముఖాన్ని తనలో భద్రపరుచుకుంటుంది. మీరు ఏదైనా మాట్లాడితే మీ గొంతును కూడా గుర్తుపెట్టుకుంటుంది. మీ వేలిముద్రలు, మీ ఫోటో, మీ గొంతు అన్నీ కలిసి కృత్రిమ మేధా, ఏ ఐ ఉపయోగించి, మీ డిజిటల్ క్లోన్, అంటే మరో మీరు తయారై, నేరస్తుల చేతిలో చిక్కుకుపోతారు. వీటిని ఉపయోగించి అనేక బ్యాంకులో కోట్ల రూపాయల నగదు రుణంగా తీసుకుంటారు. అది మీకు తెలియదు. ఆ రుణ భారాన్ని మీరే తీర్చవలసి ఉంటుంది. అయితే, అది మనం తీర్చే అవకాశమే ఉండదు. ఆ రుణాల ఊబిలోంచి బయటపడే మార్గం శూన్యం. మంచివారుగా ఉండటం మంచిది కాదేమో ఒక్కసారి ఆలోచించుకోండి.