Telugu News Power

బిజెపి పథకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్తి

పాలకొల్లు/ ఉండి: ఏప్రిల్,6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు పట్టణంలో బిజెపి జర్నలిస్ట్ కాలనీ, శక్తి కేంద్రం బూత్ ల వద్ద బూత్ అధ్యక్షులు అప్పలస్వామి, లక్ష్మీనారాయణ ల ఆధ్వర్యంలో బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి నేతలతో ,పట్టణ అధ్యక్షుడు కొల్లికొండ ప్రసాద్ ఆధ్వర్యంలో, శక్తి కేంద్రం కెనాల్ రోడ్ లో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా జెండా స్థూపం ఆవిష్కరణ, ఎల్ అండ్ టి కాలనీలో పసుపులేటి నంద, రావూరి సుధా, ఎర్రం శెట్టి పద్మారావు, జక్కంపూడి కుమార్, గవర పవన్, కె.వి.కృష్ణ వర్మ, అల్లూరి పద్మ వర్మ, బైలా శ్రీధర్, కొల్లి నరసింహమూర్తి, కొణిజేటి గుప్తా, ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు బలరామరాజు ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా జండా స్థూపం ఆవిష్కరణ బహిరంగ సభ లువేరువేరుగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవంలలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తపన చౌదరి,జిల్లా ప్రధాన కార్యదర్శి , జిల్లా మన ఊరు మన జెండా కార్యక్రమ ఇంచార్జి మరియుఅసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కలిదిండి వినోద్ వర్మ ,జిల్లా మాజీ అధ్యక్షుడు నార్ని తాతాజీ,జిల్లా నలుమూలల బిజెపి కుటుంబ సభ్యులుతో ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరిగాయి.