యలమంచిలి: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా,శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రం, గుంటూరు, వేదిక(తెలుగు నాటక పరిశుద్ధుల సమ్మేళనం)వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న, భారత్ రంగ్ మహోత్సవ్ కార్యక్రమంలో, కొంతేరు యూత్ క్లబ్ గుర్తింపు లభించింది. కథకుడు, రచయిత, నాటక రచయిత, గుణ నిర్నేత, నిర్వాహకుడు, గంట కళ్యాణి నాయుడు ఈ సందర్భంగా పురస్కారం అందుకున్నట్టు, బుధవారం తెలిపారు. అంతర్జాతీయ నాటకోత్సవం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, చిలకలూరిపేట, శాసనసభ్యులు, మాజీ మంత్రి, ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు, తూర్పు శాసనసభ్యులు నజీర్, వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు తదితరులు చేతుల మీదుగా పురస్కారం అనుకున్నట్టు గంట నాయుడు తెలిపారు
భారత్ రంగ్ మహోత్సవ్ లో కొంతేరు యూత్ క్లబ్ కు గుర్తింపు.
గంట నారయుడును సత్కరిస్తున్న వేదిక ప్రముఖులు