Telugu News Power

భారత స్వాతంత్రం, మహనీయుల త్యాగఫలం. -మంత్రి నిమ్మల

జాతీయ పతాకానికి గౌరవ వందనం చేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి,26 (తెలుగు న్యూస్ పవర్) ఎందరో మహనీయులు త్యాగఫలంతో,భారత స్వాతంత్ర్యం సిద్ధించి, స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా,సోమవారం, స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా, ,మంత్రి తివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఆంధ్ర రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దుర్మార్గపు బ్రిటిష్ పాలన తలపించిన వైసిపి పాలన అంతమొందించి, రాష్ట్ర ప్రజలు నిజమైన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం దేశ సమగ్రతను, ఏకత్వాన్ని ఎల్లవేళలా పరిరక్షిస్తుందన్నారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, గన్నేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, మామిడి శెట్టి పెద్దిరాజు, ఉన్నమట్ల కపర్తి, భాను చినబాబు,తులా రామలింగేశ్వర రావు, పొట్నూరి శ్రీనివాస్, గుమ్మళ్ళ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.