Telugu News Power

భీమవరం మావుళ్ళమ్మ వారి నిత్యాన్నదాన పథకానికి సుంకర వారి భూరి విరాళం.

అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి నగదు విరాళం సమర్పిస్తున్న సుంకర కుటుంబ సభ్యులు.

భీమవరం: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, మహిమాన్విత మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన వితరణకు శుక్రవారం భూరి విరాళం భక్తులు సమర్పించుకున్నారు. కీర్తిశేషులు, సుంకర శ్యామల బ్రహ్మాజీరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఒక లక్ష 12వేల రూపాయల నగదు దేవస్థానం వారికి అందజేశారు. ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ దాతలకు వేద ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహాలక్ష్మి నగేష్ భక్తులకు అమ్మవారి చిత్ర పటం, శేష వస్త్రం అందజేశారు. ఆలయ ధర్మకర్తలు పాపోలు ఏడుకొండలు, గొంతిన రమణ పాల్గొన్నారు.