Telugu News Power

మంత్రి నిమ్మలచే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం

 

కార్తీకమాస శుభారంభం కావడంతో పంచారారమక్షేత యాత్ర బుధవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో అతిముఖ్యమైన శిరోభాగమైన క్షీరారామం పాలకొల్లుకు వచ్చే భక్తులకు కార్తీక మాసాంతం వరకు జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు నేడు పెదగోపురం వద్ద గల రేపాక వారి సత్రంలో స్వయంగా వడ్డించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాతల సహకారంతో తలపెట్టిన ఈ పథకంలో విరాళాలు అందిస్తున్న దాతల సౌజన్యాన్ని అభినందించారు. భక్తులకు ఏ సౌకర్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు దాతలు, ఆలయ ధర్మ కర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు (రాము), ధర్మ కర్తలు ఉప్పలపు పెద్దిరాజు, కొండ్రెడ్డి సూర్యనారాయణ, బాసిన సత్యనారాయణ, పినిశెట్టి శ్రీనివాస్, పెనుమత్స శ్రీదేవి, నాళం సురేఖ, వందరపు కుమారి, హోతా ప్రవళ, నీలపు సింహాచలం,నీలపు మణి, ఎస్.క్రిష్టప్ప, దేవస్థానం ఈ. ఓ ముచ్చర్ల శ్రీనివాస్, యూ. బీజేపీ కాపర్ది,జీవి, పెశ్చెట్టి బాబు తదితరులు తెలుగు దేశం నాయకులు కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.