
పాలకొల్లు; మార్చి,2(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం నాలుగు కోట్ల 29 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 6 శంకుస్థాపనలు చేశారు. స్థానిక ఏఎస్ ఎన్ ఎం ప్రభుత్వ కళాశాలకు 23 లక్షలు, కులాయి చెరువు గట్టు అభివృద్ధి సుందరీకరణకు, 2 కోట్ల రూపాయలు, మూడో వార్డు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు, సమత మహిళా మండలి భవన నిర్మాణానికి 29వ వార్డులో 40 లక్షల రూపాయలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 75 లక్షల రూపాయలు, స్థానికలజపతిరాజుపేట పార్క్ అభివృద్ధికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. ఈ పనులకు శంకుస్థాపన చేసి మంత్రి శ్రీకారం చుట్టారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేసిన 86 లక్షలు రూపాయల చెక్కులను 111 మంది లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం మంత్రి కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు,రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు, కర్నేని గౌరు నాయుడు, రోజా రమణి దంపతులు పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు ఉన్నమట్ల కపర్తి, బోనం చినబాబు, పాలవలస తులసీ రావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, ఆరమిల్లి చిన్ని, దాసరి రత్నరాజు, పీతల శ్రీనివాస్, బొప్పన హరి కిషోర్, చిలుకూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.