Telugu News Power

మంత్రి నిమ్మల శంకుస్థాపన – పాలకొల్లులో సంబరాలు !

నేడు పాలకొల్లు పట్టణంలో మూడున్నర కోట్ల పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు
పాలకొల్లు పట్టణంలో మూడున్నర కోట్లతో చేపట్టనున్న 12 అభివృద్ధి పనులకు రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు నేటి ఉదయం నుంచి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొత్త పైప్ లైన్ కోసం 24,25 వార్డుల్లో రూ. 28.49 లక్షలు, హనుమాన్ కాలనీలో రూ. 14.38 లక్షలతో ప్రహారీ నిర్మాణం, ఇదే కాలనీలో రూ., 6.05 లక్షల తో సీ సీ రోడ్డు, చంద్రజీ నగర్ లో రూ. 6.35 లక్షలతో సీ సీ రోడ్డు,31వ వార్డు లో రోడ్డు, డ్రైన్ కు  రూ. 17.11లక్షలు, హిందూ శ్మశాన వాటికకు రూ. 17.50 లక్షలు, 10వ వార్డులో రోడ్లకు రూ. 39లక్షలు, వాటర్వక్స్ కు రూ. 89.51 లక్షలు, జెనరేటర్కు 40లక్షలు, వాటర్ పంపు హౌస్ 40 లక్షలు, బ్రాడిపేటలో సి సీ రోడ్డు కు 8.95 లక్షలు, తూర్పు కాపు కమ్యూనిటీ హాల్ 2వ వార్డుకు40లక్షలు వెరసి 12 పనులకు వివిధ నిధుల సేకరించి మొత్తం 3కోట్ల 47లక్షల 34వేల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయి.