పాలకొల్లు: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ కమిషనర్ అవార్డుకు ఎంపిక అయ్యారు. గణతంత్ర దినోత్సవం రోజున, కలెక్టర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. స్థానిక సర్కిల్ పరిధిలోగల, పాఠశాల, కళాశాలల విద్యార్థులు, యువత మాదకద్రవ్యా బారిన పడకుండా, వీరు నిర్వహిస్తున్న, అనేక అవగాహన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరు వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా. పలువురు అభినందనలు తెలియజేశారు.
మద్దాలకు అవార్డు
అవార్డు గ్రహీత,సర్కిల్ ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాస్