Telugu News Power

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

సత్కారం అందుకున్న వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నేత కర్రా జయ సరిత

పాలకొల్లు: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ ప
పవర్. కాం) మహిళలు ఆర్థికంగా ఎదగాలని, వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కర్రా జయసరిత పిలుపునిచ్చారు. రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, శుక్రవారం స్థానిక వై జంక్షన్ వద్ద గల, నియోజకవర్గ, వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి, నియోజకవర్గ ఇన్చార్జ్, గుడాల హరి గోపాల రావు, గోపి, డిసిఎంఎస్ మాజీ చైర్మన్, ఫ్లోర్ లీడర్ యడ్ల తాతాజీ, చీర రామలింగేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ కోరాడ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జయ సరిత తను ప్రసంగాన్ని కొనసాగిస్తూ, పురుషాధిథఖ్య ప్రపంచంలో, తమ శక్తియుక్తులను ప్రదర్శించి, వారికి దీటుగా నిలవాలని కోరారుల. ఇప్పటికే మహిళలు పలు రంగాల్లో తమ కృషి,పట్టుదలతో, బలమైన ఆలోచన విధానంతో ముందున్నారన్నారు. పురుషులపై ఆధారపడకుండా మహిళలు తమంతటితాముగా, స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించచారు. మహిళలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు జయ సరిత, పూలమాలు వేసి పట్టు చీరలు పెట్టి, ఘనంగా సత్కరించారు. అనంతరం, జయ సరితను మహిళల ఘనంగా సత్కరించారు. పలువురు వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.