పాలకొల్లు:డిసెంబర్,11 (తెలుగు న్యూస్ పవర్) మనుషుల అక్రమ రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద నేరంగా పరిగణించబడుతుందని పాలకొల్లు మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాదుకు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ శిక్షణ కార్యక్రమం గురువారం ముగింపు సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ,ప్రతిరోజు ఎంతోమంది యువతులు, మహిళలు మానవ రవాణాకు బలి అవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగం,సినిమాలలో అవకాశం ఇప్పిస్తామని నేరస్తులు పన్నే ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు. వారి వలలో చిక్కుకున్న వారిని ఇతర దేశాలకు తరలించి అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మహిళ అవగాహన కలిగి, తమ పరిధిలోని వారికి కూడా జాగ్రత్తలు తెలియజేయాలని కోరారు. ప్రజ్వల ప్రతినిధులు మాట్లాడుతూ మాట్లాడుతూ మహిళలకు డబ్బు ఆశ చూపి, ఉద్యోగాల ఎరవేసి వ్యభిచార గృహాలకు అమ్మివేస్తున్నారని, అవయవాలు తీసేస్తున్నారని అన్నారు. ఇలా ఎందరో దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారన్న. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమం లో భాగంగా లఘు చిత్రాలను ప్రదర్శించారు. మానవ అక్రమ రవాణా వ్యాపారానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అమాయక మహిళలు ఈ మోసాలకు గురవుతున్నారన్నారు. నేటి కాలంలో యువత మొబైల్ ఇంటర్నెట్ ద్వారా సైబర్ ట్రాఫికింగ్ వలలో పడుతున్నారన్నరు. మహిళలకు అనుమానం వచ్చినపుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. పద్మశ్రీ,డాక్టర్ సునీత కృష్ణన్ ఈ సంస్థను స్థాపించారు. గత 28 ఏళ్లుగా ఈ అవగాహనాశిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 29,200 మంది మహిళలను, యువతులను రక్షించి, వారికి పునరావాసం కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ పి ఆర్ డి మూర్తి బాబు, రెవెన్యూ అధికారి నాగరాజు, ఏవో రామదాసు నాయుడు, పద్మాజీ, కోఆర్డినేటర్ సురేష్ కుమార్, చెన్నకేశవులు, పంచాయతీరాజ్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
