Telugu News Power

మహిళల కోసం మహత్తర కార్యం

అంబులెన్స్ ప్రారంభిస్తున్న ఆర్టీవో నాయక్

-వైజాగ్ బుజ్జి వెల్లడి. యలమంచిలి: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి గ్రామానికి అంబులెన్స్ ,కైలాస రథం అందుబాటులోకి వచ్చాయి. తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఈ వాహనాలకు దాదాపు 23 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ రెండు వాహనాలను పాలకొల్లు ఆర్టీవో నాయక్ శనివారం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఫిట్నెస్ సర్టిఫికెట్ తాళ్లూరి శ్రీనివాస్ కు ఆర్టీవో అందజేశారు. స్థానిక పంచాయతీ దగ్గర గల రెండు సెంట్లు స్థలాన్ని ,వైజాగ్ బుజ్జి తన సొంత నిధులతో సేకరించారు. ఇందుకు దాదాపు సుమారు 6 లక్షల రూపాయల వ్యయం చేశారు. ఈ స్థలంలో వాహనాలకు పక్కా షెడ్డు నిర్మిస్తారు. అంబులెన్స్ నెంబర్ 108 వచ్చినట్టు శ్రీనివాస్ తెలిపారు. ఈ వాహనాలు అవసరమైన వారు 9644000108 కి ఫోన్ చేసి వాహన సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు శ్రీనివాస్ తెలిపారు.యలమంచిలి లో మహిళలకు అవసరమైన స్నాన ఘట్టం లేదని పలు సందర్భాల్లో మహిళలు శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పుణ్యస్త్రీ మరణించినప్పుడు నిర్వహించే క్రతువు లు సందర్భంగా మహిళలు స్నాన ఆచరించవలసి ఉంది. అయితే ఇందుకు వీలైన స్నానం చేసి సౌకర్యం లేదు. ఇన్నేళ్లలో ఎప్పుడూ, ఎవరు ప్రయత్నం కూడా చేయలేదు. ఇందుకుగాను శ్రీనివాస్ మరో 10 లక్షల ఖర్చు చేసిచేసి ఆర్ సి సి స్లాబ్ వేసి భవనం నిర్మిస్తారు. ఇందులో మహిళలకు అనువుగా గదులు, స్నానానికి షవర్ బాత్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందువల్ల బహిరంగ ప్రదేశాల్లో మహిళలు స్నానం చేసేటప్పుడు పడే ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు వైజాగ్ బుజ్జి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి దేవస్థానం కమిటీ అధ్యక్షులు బొల్లంపల్లి శ్రీనివాస్, తాళ్లూరి సత్య శ్రీనివాస్, సిద్ధాని రాము, ఆకులు ఏసు, మేక కృష్ణ, దేవస్థానం కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు

ఆర్డీవోకు దేవస్థానం తరుపున సత్కారం.