పాలకొల్లు: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల పురోభివృద్ధికి కూటమి ప్రభుత్వం
కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మహిళలు గౌరవంగా జీవించడం కోసం వృద్ధాప్యంలో వారికి నాలుగు వేల రూపాయల పింఛను అందజేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి ద్వారా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15వేల రూపాయలు చొప్పున వారికి అందజేస్తున్నామన్నారు. ఇందువల్ల వారి పిల్లలు చదువుల్లో రాణించి ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు శక్తికి ప్రతిరూపమని తెలిపారు.మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, ఆనాడు ఇందిరాగాంధీ మదర్ థెరిసా వంటి వారిని నుంచి నేటి సునీత విలియమ్స్ వరకు, మహిళలు లేని రంగం లేదన్నారు. ఈ సందర్భంగా, వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్టలైన సుమారు 300 మందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, పెచ్ఛెటి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పాములు రజనీ కుమార్, మామిడి చెట్టు పెద్దిరాజు, గొట్టుముక్కలు సూర్యనారాయణ రాజు, ముచర్ల శ్రీనివాస్, పెనుమత్స రాంభద్రరాజు, ఆరమిల్లి రామ శ్రీనివాస్, కర్నేని గౌర్ నాయుడు, నాకంటే ఆదినారాయణ, పీతల శ్రీనివాస్, ఫౌండేషన్ కన్వీనర్ రావూరి వెంకట అప్పారావు, మహిళా నేతలు, కర్నేని రోజారమణి, పెండ్యాల భవాణి, లక్ష్మి మైగాపుల పద్మజ, అల్లూరి పద్మ వర్మ, ఎస్తేరు, నిర్మల కుమారి, కనకదుర్గ, జ్యోతి, కె. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహిళాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి.
మహిళా నాయకురాలు కర్నేని రోజారమణి సత్కరిస్తున్న మంత్రి నిమ్మల