Telugu News Power

మాజీ డిజిపి దొర మృతి.

మాజీ డిజిపి హెచ్ జే దొర

హైదరాబాద్: మార్చి, 13,(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె దొర శుక్రవారం మృతి చెందారు. వీరు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా లో 1943 లో జన్మించారు. ఐపీఎస్ అధికారిగా 1965లో ఎంపికయ్యారు. కేంద్ర విజిలెన్స్ అధికారిగా కూడా పనిచేశారు.ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అన్న ఎన్టీఆర్ దగ్గర ఇంటెలిజెన్స్ అధికారిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,హయాంలో రాష్ట్ర డీజీపీగా దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. నాడు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నక్సల్ సమస్య పరిష్కారంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారు. హెచ్.జె దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేసారు.