Telugu News Power

మాజీ మంత్రి కావూరి మృతి.

మాజీ కేంద్రమంత్రి కావూరి మృతి

హైదరాబాద్: మార్చి,9(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పారు. కావూరు సాంబశివరావు సోమవారం మరణించారు. వయోభారం వల్ల ఆరోగ్య సమస్యలతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ అక్కడే మరణించారు.
రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కావూరి సాంబశివరావు (82) మరణ వార్త, వారి అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వీరు 5సార్లు ఎంపీగా గెలిచారు.
కేంద్ర జౌళిశాఖమంత్రిగా 2013లో దేశానికి విశేష సేవలందించారు. రాజకీయాల్లోనే కాకుండా పారిశ్రామిక రంగంలోనూ ఎందరికో ఉపాధిని కల్పించి, ఆదర్శంగా నిలిచారు.
వారి మరణం తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా కృష్ణా జిల్లాకు తీరని లోటు. వారికి ఒక కుమారుడు మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు పలువు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.