పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ మంత్రి, మాజీ ఎంపీ, రాజకీయ కురువృద్ధులు చేగొండి జోగయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా కలిసి, హరిబాబును సత్కరించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి నుంచి నిమ్మల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరిబాబు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, పెచ్ఛెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, బోనం నాని, ఐజేయు నాయకులు, అల్లూరి సీతారామరాజు తిరుమలి ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ హోం మంత్రి ‘చేగొండి’ కి మంత్రి నిమ్మల శుభాకాంక్షలు.