పాలకొల్లు:డిసెంబర్,20( తెలుగు న్యూస్ పవర్) మాదకద్రవ్యాల వినియోగనిరోధం ఒక సామాజిక కర్తవ్యంగా గుర్తెరగాలని పాలకొల్లు సిఐ మద్దాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక ఛాంబర్స్ కాలేజీ ఆవరణలో శనివారం మాదకద్రవ్యాల వినియోగం-దుష్ప్రభావం, అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత తాత్కాలిక ఆనందాల కోసం ఆకర్షితులవుతున్నారన్నారు. ఈ తాత్కాలిక సంతోషాల వల్ల, వారి ఉజ్వల భవిష్యత్తు చేజేతుల పాడు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వినియోగం ఆయా వ్యక్తులనే కాక, కుటుంబాలనూ ఆర్థిక కష్టాల్లోకి నెట్టి వేస్తుందన్నారు. అనారోగ్యంతో అవస్థలు పాలవుతున్నారు. సమాజంలో కలవలేక ఒంటరి వారవుతున్నారన్నారు. ఈ వ్యసనం వల్ల వారిలో నేర ప్రవృత్తి కలుగుతుందన్నారు. చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ యువత నైపుణ్యాలపై దృష్టి పెట్టడం వల్ల, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారన్నారు. మాదకద్రవ్యాల ను వినియోగిస్తున్న వారిపై నిఘా పెట్టి అధికారులకు తెలియజేయడం వల్ల, వారిని ఆ ఊబిలో కూరుకుపోకుండా కాపాడవచ్చునని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమం వల్ల విద్యార్థులను విద్యాలక్ష్మి వైపు మళ్లీంచడానికి వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, ఎక్సైజ్ ఎస్సై జి రఘు, అకడమిక్ అడ్వైజర్స్ ఏ బి ఎస్ మూర్తి, నందుల సీతారామారావు,ఎన్ ఎస్ ఎస్ రాధామాధవి, రాంబాబు, కోఆర్డినేటర్ ఏ ఉషశ్రీ, అధ్యాపకులు రవికుమార్, జానకి రామయ్య, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
