Telugu News Power

మానవత కెరీర్ గైడెన్స్ .

బహుమతులు అందజేస్తున్న 'మానవత' ప్రతినిధులు

పాలకొల్లు: ఫిబ్రవరి,6 (తెలుగు న్యూస్ పవర్) దిగమర్రు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సందర్భంగా, వారి ప్రతినిధులు పాల్గొని, విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ గురించి వివరించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి, తమ కలలు నిజం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిభావంతులైన 8,9,10 విద్యార్థులకు మానవతా సంస్థ వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోట శ్రీనివాస్, చాముకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.