Telugu News Power

మారేడుదళ ప్రదక్షిణలో విశేషంగా పాల్గొన్న భక్తులు.

ప్రదక్షిణలో పాల్గొన్న ఆలయ ఈవో, భక్తులు

పాలకొల్లు: మార్చి, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ వద్ద సోమవారం, ఏడు మారేడు దళములతో, ఏడు ప్రదక్షిణములలో మాడవీధులలో ప్రదక్షిణాలు భక్తులు ప్రదక్షిణలు చేశారు. సుమారుగా 350 మంది భక్తులు పాల్గొన్నారు. ఈకార్యక్రమం లో కార్యనిర్హవనాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాలు రామచంద్రరావు, పినిశెట్టి శ్రీనివాస్ ధర్మకర్త, సూపరింటెండెంట్ వాసు, ప్రధాన అర్చకులు కిష్టప్ప, పాల్గొన్నారు. రాత్రి, 7గంటలకు శ్రీ స్వామి వారి ధూప సేవ,7.30 గంటలకు శ్రీ స్వామివారి పంచహారతుల సేవ నిర్వహించి నట్టు కార్యనిర్వాహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు.