భీమవరం: మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) భీమవరం ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి 1,10,116 బుధవారం సమర్పించారు. గాది రాజు గణేష్ కుమార్, హేమ దంపతులు, వారి కుమారులు, చిరంజీవి పార్థివ్ వర్మ ఈ కానుక అందజేశారు. వీరు ఉండి మండలం, కలిగొట్ల వాస్తవ్యులు. ఈ సందర్భంగా, గణేష్ కుమార్ కుటుంబానికి, అమ్మవారి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల ప్రకారం, అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి ప్రసాద్, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేష వస్త్రం పుణ్య దంపతులకు అందజేశారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, గొంతెన రమణ, కారంపూడి ఆదిలక్ష్మి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు
మావుళ్ళమ్మ వారి స్వర్ణ నిధికి లక్ష విరాళం.