హర్షద్ మెహతా
పాలకొల్లు నవంబర్ 18 తెలుగు న్యూస్ కావాలి న్యూస్ పవర్ భారతదేశంలో ఉన్నన్ని చట్టాలు మరే దేశంలోనూ ఉండకపోవచ్చు కానీ ఆ చట్టాలు కోరలు లేని పాము లాంటివి. చట్టాల్లో ఉన్న లోపాలు ఆసరాగా చేసుకుని ఎందరో వేల కోట్లు సంపాదించి చివరకు చట్టం కోరలకే చిక్కి తనువు చాలించిన వారు చాలా మంది ఉన్నారు. హర్షద్ మెహత స్టాక్ మార్కెట్ స్కామ్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన భారీ స్కాములలో ఒకటి. ఇతను స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ గా పేరు తెచ్చుకున్నాడు. గుజరాత్ నుంచి ముంబై చేరిన ఒక మధ్య తరగతి యువకుడు. బీకాం మాత్రమే చదివి, చిన్నచితక ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో ప్రవేశించాడు. ఆఫీస్ బాయ్ గా, ఇన్స్యూరెన్స్ కంపెనీ లో గుమాస్తా గా ప్రారంభించిన అతని జీవితం బిగ్ బుల్ స్థాయికి అత్యంత వేగంగా దూసుకుపోయింది.స్టాక్ మార్కెట్లో ఉన్న వ్యవస్థీకృత లోపాలను అధ్యయనం చేశారు. అదే అతనికి వరం అయింది. బ్యాంకు లను ఏమర్చి బ్యాంక్ రసీదు ,బిఆర్ సంపాదించి ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో వాటాలు భారీగా కొనటానికి వినియోగించేవాడు. అయితే బ్యాంకు కు సమర్పించిన బిఆర్లు నకిలీవి లేదా దొంగ సంతకాలతో ఉన్నవి. వీటిని అడ్డం పెట్టుకొని భారీగా కొన్న షేర్లు ధరలు ఆకాశానికి తీసుకువెళ్లేవాడు. అక్కడి నుంచి అకస్మాత్తుగా, ఒక్కసారిగా తన దగ్గర ఉన్న షేర్లు అన్ని అమ్మి వేల కోట్ల రూపాయల లాభాలు పోగేసుకునేవారు. బ్యాంకులకు అనుమా వచ్చేసరికి వెంటనే బిఆర్ సంబంధించిన మొత్తం జమ చేసేవాడు. ఈ విధంగా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. దాదాపు పుష్కరకాలం భారత దేశ స్టాక్ మార్కెట్ తన గుప్పట్లో పెట్టుకుని ఆడించిన గొప్ప మేధావి హర్షద్ మెహతా. అయితే 1992లో అతని స్కాం బయటపడి జైలు పాలయ్యాడు. అప్పట్లో ఆరేడు వేల కోట్ల రూపాయల స్కాం గా ఉన్న మొత్తం ప్రస్తుత విలువ ప్రకారం 30 వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. జైలులోనే అక్టోబర్ 31, 2000 లో గుండె పోటు తో మరణించాడు.
అబ్దుల్ కరీం తెల్గీ
ఇతను కర్ణాటకలోని ఖానాపూర్ మారుమూల గ్రామం నుంచి ఉద్యోగం కోసం ముంబై చేరాడు. అక్కడ రైల్వే స్టేషన్లో చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు ఆ తర్వాత దుబాయ్ వెళ్లే వారికి హజ్ యాత్రకు వెళ్లే వారికి దరఖాస్తులు తయారు చేయడంలో సహకరించే దుబాయ్ లో కూడా కొన్ని రోజులు చేశాడు ఆ తర్వాత ఇండియాకు వచ్చేసాడు తను సంపాదించిన అనుభవంతో భారతదేశంలో ఉన్న స్టాంపు పేపర్ల యొక్క డిమాండ్ అందుకు సరిపడని భారత ప్రభుత్వ వ్యవస్థ లోపాలను గ్రహించాడు నాసిక్ లో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ పాత సామాగ్రి అమ్మి వేస్తే అది కొన్నాడు ఆ ప్రశ్న ఆ ప్రెస్ తిరిగి ప్రారంభించి స్టాంప్ పేపర్లు ముద్రించడం మొదలుపెట్టాడు అతని నెట్వర్క్ 12 రాష్ట్రాలకు విస్తరించాడు వ్యవస్థలో ఉన్న పోలీసు అధికార యంత్రాంగం బ్రోకర్ల ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొన్నాడు. విలాసవంతమైన జీవితాన్ని పాలు దేశాల్లో అనుభవించాడు. 2000 సంవత్సరంలో పోలీసుల దాడుల్లో స్టాంప్ పేపర్ స్కాం బయటపడింది అప్పటికి దాని విలువ 46 వేల కోట్లు అయితే ఇది చాలా తక్కువ మొత్తంగా అంచనా వేశారు స్టాంప్ పేపర్ల కుంభకోణం విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా.
ఇమ్మడి రవి
ప్రపంచాన్ని పైరసీలో ముంచెత్తిన మహా మోసగాడు మనవాడే, తెలుగువాడు ఇమ్మడి రవి. విశాఖపట్నం జిల్లావాసి. బీఎస్సీ చదివాడు. వెబ్ డిజైనర్ గా జీవితాన్ని ప్రారంభించాడు. పోలీసులు తనను పట్టుకోమని సవాలు విసిరిన సాహస నేరగాడు రవి. ఇతను 21 వేల సినిమాలు ఎరగా వేసి 50 లక్షల మంది డేటా సేకరించాడు. దీని ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు. ఉచితంగా సినిమాలు ప్రదర్శించడం వల్ల అతనికి ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. అతను దేశాల్లో ఉన్న ఈ గేమింగ్ సంస్థలతో నేరుగా సంబంధాలు పెట్టుకున్నాడు. ఇతని నేర సామ్రాజ్యం స్విజర్లాండ్ నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి నెట్వర్కింగ్ లో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకుని పైరసీ కింగ్ ఐ బొమ్మ వ్యవస్థాపకుడు ఎదిగాడు. ఏ సైట్ బ్లాక్ చేసిన తన నేరపరిది విస్తరించుకోవడానికి 900 వెబ్సైట్లు తయారు చేసుకున్నాడు కరోనాకాలం. 2019 ఓట్యూటి ఓటిపి ఓ టి టి, సినిమాలకు డిమాండ్ పెరగడంతో ఆ అవకాశాన్ని అతను సోము చేసుకున్నాడు.
ముగ్గురు నేరసామ్రాజ్యానికి రారాజులుగా వెలుగొండ వీరి మేధస్సును సరైన మార్గం ఉపయోగించుకుని ఉంటే ఎంతో ఉన్నత స్థానానికి సమాజంలో గుర్తింపు నోచుకుని ఉండేవారు కానీ వారి తెలివితేటలు పక్కదారి పడటం వల్ల చివరకు జైలు పాలయ్యారు. హర్షద్ మెహతా బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలను ఔపాసనపట్టాడు. అబ్దుల్ కరీం తెల్గి స్టాంప్ పేపర్ల డిమాండ్ను, ప్రభుత్వ అసమర్థతను ఆసరాగా చేసుకున్నాడు.ఇమ్మడి రవి ప్రతి నెట్వర్కింగ్ లో ఓ లోపం ఉందని, ప్రతి సర్వర్లో ఒక లీక్ ఉందని గుర్తించాడు.
మొత్తం మీద వీరి ముగ్గురిదీ ఒకటే విధానం, చిన్న సందు దొరికితే చాలు, మహాద్వారాలు నిర్మిస్తామని నిరూపించిన నేర చరితులు.