పాలకొల్ల:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక పూలపల్లి వద్ద ఉన్న మెడ్ యునైటెడ్ ఆసుపత్రి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్డిఓ దాసిరాజు మెడ్ పాస్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య రక్షణ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నదని, అందుకే పాలకొల్లు 100 పడకల ఆసుపత్రి మంత్రి నిమ్మల రామానాయుడు తీసుకొచ్చారన్నారు. అయితే ప్రస్తుత మెడ్ పాస్, ప్రజలందరికీ 999 రూపాయల అందుబాటు ధరలో ఉందని, ఇది వారికి ఆరోగ్య విషయంలోఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ సీఈఓ వర్మ మాట్లాడుతూ వైద్య ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఆసుపత్రులకు రావటం లేదని, అది దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం మేడ్ యునైటెడ్ హాస్పిటల్స్అందిస్తున్నాయి. ఆరోగ్య రక్షణ కోసం టెస్టుల గురించి ఆలోచించకుండా వైద్యం చేయించుకోవాలని హృద్రోగ నిపునులు హృదయ మోహన్ కోరారు. ఈ సందర్భంగా మెడ్ యునైటెడ్ యాప్ అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు తెలిపారు. ఇందువల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. మెడ్ పాస్ ఆరోగ్య కార్డు మెడ్ యునైటెడ్ 29 ఆసుపత్రులలో ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందన్నారు. ఈ కార్డు తల్లిదండ్రులతో పాటు 20ఏళ్ల లోపు ఉన్న ఇద్దరు సంతానానికి కూడా వాడుకునే సదుపాయం కల్పించారు. ఈ కార్డు మీద ఎన్నిసార్లు అయినా డాక్టర్ను సంప్రదించవచ్చు. అయితే ఇవన్నీ హెల్త్ ప్రోటోకాల్ షరతులకు లోబడి వర్తిస్తాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
