యలమంచిలి:డిసెంబర్,2(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలికి మొట్టమొదటిసారిగా శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఒక ట్రస్ట్ రాబోతుంది. యలమంచిలి అభివృద్ధికి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, పేదల సంక్షేమానికి ఎప్పటినుంచో పాటుపడుతున్న తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నట్టు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ మేరకు సింహాచల అప్పన్న, క్షేత్ర వరాహ నరసింహస్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ ట్రస్ట్ కు సుకృత గా నామకరణం చేశారు. చిహ్నాన్ని విడుదల చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడానికి వీలవుతుందని నిర్వాహకులు తెలిపారు.
