Telugu News Power

యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల పర్యటన

మంత్రి రమానాయుడుకి స్వాగతం పలుకుతున్న ఎంపీపీ ధనలక్ష్మి

పాలకొల్లు,యలమంచిలి: జనవరి,4(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు, పాలకొల్లు, యలమంచిలి మండలాలలో ఆదివారం పర్యటించారు. పాలకొల్లు కమ్యూనిటీ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో అదనంగా మరో రెండు బెడ్లు ఏర్పాటు చేశారు. మంత్రి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తో కలిసి వీటిని ప్రారంభించారు. ఆగర్రు లో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేశారు. అనంతరం యలమంచిలి మండలంలో గుంపుర్రు వద్ద వల్లూరు మీడియం డ్రైన్ పై ఇన్ లెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు, రూ.24.20 లక్షలు మంజూరు చేశారు. ఈ డ్రైన్ వల్ల ఏటా ముంపుకు గురయ్యే 500 ఎకరాలకు ముంపు నుంచి రక్షణ లభిస్తుందని మంత్రి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ మంత్రికి స్వాగతం పలికారు. మండల పరిషత్ భివృద్ధికి, 5లక్షల నిధులతో చేపట్టనున్న,పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పుంతల ముసలమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద 5లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. యలమంచిలి-కాజ ఆర్ అండ్ బి రోడ్డు వేయుటకు 80 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. మంత్రి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు ఉన్నమట్ల కపర్థి, బోనం నరసయ్య, పెచ్చెట్టి బాబు, యలమంచిలి మండల టిడిపి అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షులుచిట్టూరి ఆంజనేయులు,సర్పంచుల ఛాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపాల్ రావు, నీటి సంఘం అధ్యక్షులు మాత రత్నరాజు, ఎంపీటీసీ చిలుకూరి రాజ్యలక్ష్మి శ్రీనివాస్, డేగల సూర్య ప్రభావతి,ఆరమిల్లి రామ శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిషోర్, చిలుకూరి బాలాజీ, తాళ్ల నాగరాజు,మండల టిడిపి ఉపాధ్యక్షులు తమ్మినీడి శ్రీనివాస్, తాళ్లూరి శ్రీనివాస్, వినుకొండ రవి, రావూరి మురళి, కొడవటి వరబాబు, కాసా సత్య, మాజీ జడ్పిటిసి బోనం నాని, కొప్పినీడి సర్వేశ్వరరావు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, పరువు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు మంత్రి పర్యటనలో పాల్గొన్నారు.

పుంతల ముసలమ్మ అమ్మవారి ప్రహరీ గోడ నిర్మాణం పనికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి నిమ్మల