Telugu News Power

యలమంచిలి మండలంలో 10.98 కోట్ల రూపాయల, పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన.

అవుట్ ఫాల్స్ లో శంకుస్థాపన చేస్తున్న మంత్రి రామానాయుడు.

యలమంచిలి:జనవరి,22
(తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా, గత ప్రభుత్వం అవుట్ ఫాల్ స్లూయిస్ నిర్మాణం రిపేర్లు చేపట్టకపోగా, కనీసం గ్రీజు పెట్టి నిర్వహణ చేయలేని పరిస్థితి, గత ఐదేళ్లలో రైతులు చూశారన్నారు. వరదల సమయంలో గేట్లు మూసుకోకపోవడం, తెరచుకోక పోవడం వల్ల గ్రామాలకు, గ్రామాలు నీట మునిగి రైతులు నష్టపోయారన్నారు. ఏటిగట్టు ప్రమాద పరిస్థితుల్లో ఉన్న కూడా, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, మాధవాయపాలెం, కాజా ఔట్ ఫాల్స్ స్లూయిస్ కు నిధులు మంజూరు చేశామన్నారు. ఈ స్లూయిస్ కు 9.04 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్టు తెలిపారు. యలమంచిలి ఏటిగట్టు నుండి ఏనుగువానిలంక వరకు గ్రావెల్ దారి వేయుటకు1.88 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. మండలంలోని, అడవిపాలెం, యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో కోటి రూపాయలతో నిర్మించనున్న, డ్రైన్, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పొత్తూరి రామరాజు, మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్ది, మండల టిడిపి అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, నీటి సంఘం అధ్యక్షులు, ఆరు మిల్లి రాము శ్రీనివాస్, మాతరత్నం రాజు, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిషోర్, చిలుకూరి శ్రీనివాస్, తాళ్లూరి శ్రీనివాస్, తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు, సర్పంచులు ఛాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపాలరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

మంత్రి నిమ్మలకు స్వాగతం పలుకుతున్న యలమంచిలి టిడిపి నాయకులు