Telugu News Power

యలమంచిలి మండలం యూ టీ ఎఫ్ శాఖకు ప్రధమ స్థానం.

ప్రస్తుత కూటమి ప్రభుత్వ పని తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి , అసహనం తో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. యూటీఎఫ్ యలమంచిలి మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండలిలో ప్రతిపక్ష వైసీపీ పార్టీకి అధిక సంఖ్యలో సభ్యులు ఉన్నప్పటికీ ప్రభుత్వ బిల్లుల ఎలా పాస్ అవుతున్నాయని ప్రశ్నించారు. మండలిలో తానొక్కడే ప్రతిపక్ష పార్టీగా ఉంటూ, ప్రజావ్యతిరేక దోపిడీ విధానాల పై పోరాటం చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా యూ టీ ఎఫ్ జిల్లా స్థాయిలో సభ్యత్వాల(270) నమోదు,జనరల్ ఫండ్(4లక్షల లు)సేకరణలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు అభినందనలు తెలిపారు. పాలకొల్లు వైష్ణవి పాఠశాలలో బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవం గా ఎన్నికై, కౌన్సిల్ ప్రమాణస్వీకారం చేసింది. ఆఫీసు బేరర్లు, జిల్లా కౌన్సిలర్ లు, కార్యవర్గ సభ్యులు బాధ్యత స్వీకరించారు.
యూటీఎఫ్ నాయకులు విజయ రామ రాజు, అంగర రామభద్రం, కే. రాజశేఖర్, పోలిశెట్టి క్రాంతి కుమార్ , లక్ష్మీ నారాయణ, దండు పద్మావతి, డి.యేసు బాబు, రామానుజ రావు, ఎంవి రాజశేఖర్, పిల్లి శ్రీనివాస రావు, డివి నరసింహ రావు, పులఖండం శ్రీనివాస్, ఇ డి వి ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు ఆర్ సత్యనారాయణ, అవధాని,దిగమర్తి రాంబాబు, ఎంవి సత్యనారాయణ, బీ. శ్రీనివాసరావు, గోటేటి వేంకట సాయి, అడ్డాల భాస్కర రావు, ఐ వి వి నరసింహ రాజు, దశిక సత్యనారాయణ పాల్గొన్నారు. గౌరవాధ్యక్షులు వి. జగ్గారావు స్వాగతోపన్యాసం చేశారు.
పురస్కారాలు
రక్త దాతలను అభినందిస్తూ ఎమ్మెల్సీ ధ్రువపత్రాలు అందజేశారు.
ఒకటవ తరగతి లో ఎక్కువ మంది విద్యార్థుల ను చేర్చిన ఉపాద్యాయులను మెమేంటోలతో సత్కరించారు.
నూతనంగా కొలువులో చేరిన ఉపాద్యాయులకు, వారికి అవసరమైన కిట్లు అందించారు.ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్ష, కార్యదర్శులు జి. శ్రీనివాస్, పంతం రామ్మూర్తి నాయుడు, దేవ సుధాకర్, పలువురు మహిళా ఉపాద్యాయుల అధిక సంఖ్య లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఎంపీటీసీ డేగల సూర్య ప్రభ దంపతులు హాజరయ్యారు.

Photos