
యలమంచిలి:నవంబర్,23 (తెలుగు న్యూస్ పేపర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని మేడపాడు సెంటర్ నుంచి యలమంచిలి కళ్యాణ మండపం దగ్గర సభాస్థలి వరకు సాగింది. ర్యాలీలో మంత్రి మిమ్ములను గజమాలతో సత్కరించారు. మహిళలు ఎక్కడికక్కడ పూలజల్లులతో, హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో మండల తెలుగుదేశం అధ్యక్షులు మామిడిశెట్టిపెద్దిరాజు, బోనం నాని,తెలుగు యువత అధ్యక్షులు బొప్పన రాంబాబు, తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరి కిషోర్, చిలుకూరు కుమార్, కూర్మా రావు, నాయకులు కార్యకర్తలు ఈ ర్యాలీలో హుషారుగా పాల్గొన్నారు
