Telugu News Power

యలమంచిలి శివాలయంలో మాస శివరాత్రి పూజలు.

అభిషేక పూజలు అందుకొన్న శివుడు.

యలమంచిలి:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) మాస శివరాత్రి సందర్భంగా, గురువారం యలమంచిలి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, కుమార్, సుబ్రహ్మణ్యం ఈ పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కోడూరి రామలింగ జోషి కుటుంబ సభ్యులు, ,శ్రీరామచంద్రమూర్తి మనవరాలు విజయసాయి హరిప్రియ(బెంగళూరు) వారి అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. టిడిపి నాయకులు తాళ్లూరి శ్రీనివాస్, సిద్ధాని రాము,ఒంటిపల్లి ప్రసాద్, కొడవటి సుబ్బరాజు, సత్య శ్రీనివాస్, బండారు వాసు,ఆకుల యేసు, ధర్మకర్తల మండలి సభ్యులు,పలువురు భక్తులు పాల్గొన్నారు.

త్రయోదశి రోజున నందికి అభిషేకాలు నిర్వహించారు.