Telugu News Power

యుటిఎఫ్ టెస్ట్ పేపర్ల ఉచిత పంపిణి.

పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో మాట్లాడుతున్న పోలిశెట్టి క్రాంతి.

యమంచిలి: నవంబర్ 29 తెలుగు న్యూస్ పవర్ మండలంలో ఉన్న 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు యుటిఎఫ్ టెక్స్ట్ పేపర్లు ఉచితంగా శనివారం పంపిణీ చేశారు. గత 15 ఏళ్లుగా దాతల సహకారంతో ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్టు యుటిఎఫ్ నాయకులు పోలిశెట్టి క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఏ శ్రీవాణి కె.వి.ఆర్.రామకృష్ణంరాజులు ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ లియాఖత్ అలీ, దిగమర్తి రాంబాబు, రామేశ్వరపు సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు మామిడి శెట్టి పెద్దిరాజు బోనం నాని, జీవనధార ట్రస్ట్ చైర్మన్ భవనం గోపాలస్వామి, కొప్పినీడి సర్వేశ్వరరావు, గోటేటి రామలింగేశ్వర రావు ఆయా పాఠశాలల, ఉపాధ్యాయులు విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

టెస్ట్ పేపర్ల తో దొడ్డిపట్ల విద్యార్థులు