Telugu News Power

యుటిఎఫ్ నిరాహార దీక్ష

యుటిఎఫ్ రణభేరి కార్యక్రమంలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు దేవ సుధాకర్

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)
యూటీఎఫ్ రణభేరి 3. పిఆర్సి కమిషన్ ఏర్పాటు, ఐ ఆర్ 29% ప్రకటించుట, డి ఎ బకాయిలు చెల్లించుట, 2004 కు ముందు నియమించబడిన ఉద్యోగులకు ఓ పి ఎస్అమలు చేయాలనే అంశాలపై రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు పాలకొల్లు నియోజక పరిధిలో పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష శిబిరం లో ఉదయం 10 గంటలునుండి 3 గంటల వరకు 70 మంది నిరాహార దీక్ష శిబిరం లో పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా 35 మంది హాజరు అయినారు.మొత్తం సుమారు 105 మంది పాల్గొన్నారు.
యలమంచిలి మండలo నుంచి నిరాహార దీక్షలో పాల్గొన్న కామ్రేడ్స్ అధ్యక్షుడు జి శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి పి రామమూర్తి నాయుడు, జిల్లా కార్యదర్శి
డి పద్మావతి,పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జయ ప్రభ, సిఐటియు నాయకులు దేవ సుధాకర్, సహాధ్యక్షులు బి శైలజ, కోశాధికారి వి సందీప్ కుమార్,మండల కార్యదర్శి
పిండి రామచంద్ర రావు, జిల్లా కౌన్సిలర్
పి వి మీనాక్షి, కార్యకర్తలు
వి దీప,సిహెచ్ స్వరూప
బి కల్యాణి,ఇ శ్రీదేవి లు పాల్గొన్నారు.
వీరికి సంఘీభావంగా
ఎం వెంకటేశ్వరరావు
అరిమిల్లి శ్రీనివాస్. సహాధ్యక్షుడు కె శరత్ బాబు, వి బాపిరాజు, ఏడిద పెద్ది నాయుడు, చలపతి, అనురాధ,
పి బాలరాజు, ఎం శివనారాయణ,కె సుబ్బారాయుడు, డి గోపాలకృష్ణ , ఎం శ్రీధర్, వై రమేష్,జె వి సాయిబాబా,కాపా శ్రీనివాస్, పి ఎల్ లావణ్య, నిరుపమ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఈ శిబిరాన్ని ఉద్దేశించి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పిఎస్ విజయరామరాజు, ప్రధానకార్యదర్శి పి క్రాంతి కుమార్ మాట్లాడినారు.