Telugu News Power

యూత్ క్లబ్ కొంతేరు పరిషత్ కు ఎంపికైన ఏడు నాటికలు.

యలమంచిలి: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కొంతేరు యూత్ క్లబ్ తరపున గత 44 ఏళ్లుగా నాటకపరిషత్ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నాటకోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ పరిషత్తులో ప్రదర్శించడానికి ఏడు నాటికలు అర్హత పొందాయి. నాటికలు ఈ ఏడాది మే నెల 1 నుంచి 3 వరకు, మూడు రోజులపాటు నిర్వహించనున్నట్టు, క్లబ్ అధ్యక్షులు అంబటి మురళీకృష్ణ వెల్లడించారు.
1.తితిక్ష
బి వి కె క్రియేషన్స్, కాకినాడ, రచన: డి ఉమాశంకర్, దర్శకత్వం డి వినరయ్

2.తరమెళ్ళిపోతున్నదో
శ్రీకరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ గుంటూరు, రచన,దర్శకత్వం: బొమ్మిడి రామకృష్ణ
3. అమ్మ చెక్కిన బొమ్మ
గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్. రచన: జ్యోతి రాజ్ భీశెట్టి, దర్శకత్వం: వెంకట్ గోవాడ.
4. భువి కోరని భ్రమణం
రచన: తాళబత్తుల వెంకటేశ్వరరావు, దర్శకత్వం: కత్తి శ్యాం ప్రసాద్.
5. అందరూ మంచివారే కానీ
మానవత-యడ్లపాడు. రచన, దర్శకత్వం:జరుగులరామారావు.
6. ఇది అతని సంతకం
అభినయ ఆర్ట్స్, గుంటూరు.
రచన: శ్రీ స్నిగ్ధ, దర్శకత్వం: ఎన్ రవీంద్ర రెడ్డి.
7. అగ్నిసాక్షి
చైతన్య కళా స్రవంతి, విశాఖపట్నం. రచన: మాడభూషి దివాకర్ బాబు, దర్శకత్వం: పి బాలాజీ నాయక్.
ప్రతిష్టాత్మక 44వ వార్షికోత్సవ పోటీల్లో విజేతలకు నగదు పారితోషికం వివరాలు:-
ప్రదర్శన పారితోషకం: రూ.17,116/-లు
ప్రధమ బహుమతి:
రూ.15,116/-లు
ద్వితీయ బహుమతి:
రూ.14,116/- లు
తృతీయ బహుమతి:
రూ.13,116/-లు. వీటితోపాటు వ్యక్తిగత బహుమతులు కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.