

అమరావతి: మార్చి,16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చారిత్రాత్మకమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతిలో ఏర్పాటుచేసిన 58 అడుగుల త్యాగ శిల్పం కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సరసన విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” నిలుస్తుంద న్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ శిల్పం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నారు. ఆ మహనీయుని చరిత్రను ముందు తరాలకు అందించడానికి, ఆంధ్రుల రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో ఆయన దీక్షకు గుర్తుగా 58 రోజులకు, 58 అడుగుల ఎత్తు విగ్రహం నిర్మించామన్నారు. భాషా ప్రయత్నం ఏర్పాటుకు స్ఫూర్తిగా, మూలపురుషుడిగా అమరజీవిని అభివర్ణించారు. ఆ మహనీయుని స్మాల్ గా అర్థం కోట్ల మందికి తాగునీరు అందించే బ్రతకాన్ని రాష్ట్రంలో ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్ గా నామకరణం చేయాలని సూచించినట్టు వెల్లడించారు. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, విగ్రహ ఏర్పాటు కృషిచేసిన ఆర్యవైశ్య ప్రముఖులు డూండి రాకేష్ పలువురు మంత్రులు అధికారులు ఎమ్మెల్యేలు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు.