సికింద్రాబాద్: మార్చి, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం రైల్వే అధికారులతో సమావేశం అయ్యారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను స్వయంగా కలిసి నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ రైల్వే అభివృద్ధి మరియు కొత్త రైలు సర్వీసుల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు.గతంలో పలుమార్లు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. కొత్త రైలు సర్వీసులు, రైళ్ల స్టోపాజీలు, హాల్ట్ లు, ఎల్ సి గేట్ల తొలగింపు పనులపైన చర్చించారు.
తాడేపల్లిగూడెంలో హైదరాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలుపుదల,
తాడేపల్లిగూడెం, అత్తిలి, తణుకు, వీరవాసరం స్టేషన్లలో ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపేజీల కొరకు అధికారులను కోరారు.
కొత్త రైలు సర్వీసులు
నర్సాపురం – విశాఖపట్నం
నర్సాపురం – బెంగళూరు ‘అమృత్ భారత్’ (స్లీపర్)
నర్సాపురం – హైదరాబాద్ ‘వందే భారత్’ రైళ్లు.నర్సాపురం – వారణాసి (కాశీ)కి నేరుగా రైలు సౌకర్యం.నర్సాపురం – రాజమండ్రి మెము సర్వీసుల పునరుద్ధరణ,సింహాద్రి ఎక్స్ప్రెస్ కు సర్వీసుల పునరుద్ధరణ,
అరుణాచలం స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను
క్రమబద్ధీకరించట,
పశ్చిమగోదావరి జిల్లా ప్రాంత రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునీకరించి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, రైలు సేవలు కల్పించదానికి కృషి చేస్తాన్నట్లు మంత్రి తెలిపారు.