భీమవరం: మార్చి,7(తెలుగు న్యూస్ పవర్. కామ్)
వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్ గ్రామీణ్ చట్టంపై గ్రామీణ ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లాలో “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు.
కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తో కలిసి గోడపత్రికలు, ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ చట్టం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి హామీతో పాటు శ్రామికుల హక్కులను బలోపేతం చేస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఆరు వారాల పాటు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞలు, గ్రామ సభలు, పాఠశాలల్లో పోటీలు, అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నారు.