విజయవాడ/పాలకొల్లు: ప్రతిష్టాత్మకంగా జరిగిన రోటరీ జిల్లా గవర్నర్ కు జరిగిన ఎన్నికల్లో స్థానిక ప్రముఖ దంత వైద్యులు ముచ్చర్ల సంజయ్ సోమవారం రాత్రి ఎన్నికయ్యారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రెవిన్యూ జిల్లాలు ఒక రోటరీ జిల్లాగా పరిగణిస్తారు. ఈ రోటరీ జిల్లాలో 74 క్లబ్బులు ఉన్నట్టు సంజయ్ తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం సభ్యులందరి సమిష్టి విజయం గా అభివర్ణించారు. ఇకపై రోటరీ క్లబ్ కార్యకలాపాలు విస్తృతంగా చేపట్టనున్నట్టు వెల్లడించారు. సభ్యులు తనపై ఉంచిన నమ్మకానికి, తగినట్టుగా పనిచేస్తానన్నారు. పాలకొల్లు రోటరీ క్లబ్ కు పాతికేళ్ల ఘన చరిత్ర ఉందన్నారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ రాజు, మద్దాల వాసు, కానూరు ప్రభాకర్ రావు, గుండు పోగుల వీరాస్వామి, పేరా బత్తుల సత్యనారాయణ, రావూరి అప్పారావు, కావలి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
రోటరీ జిల్లా గవర్నర్ గా ముచ్చర్ల సంజయ్.
తన గెలుపు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్న డాక్టర్ సంజయ్