పాలకొల్లు: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) వచ్చేనెల 13 నుంచి 15వ వరకు పాలకొల్లు కళాపరిషత్ నిర్వహించనున్న నాటిక పోటీలకు సంబంధించి, ఆహ్వాన పత్రిక శుక్రవారం ఆవిష్కరించారు. పాలకొల్లు పట్టణంలో గత 75 సంవత్సరాలుగా, నిర్వహిస్తున్న నాటక పోటీలు, తాము కూడా ప్రోత్సహించాలని ఉద్దేశంతో, పాలకొల్లు కళాపరిషత్ తరపున గత 17 ఏళ్లుగా నాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు కె.వి కృష్ణ వర్మ తెలిపారు. అడబాల థియేటర్ వద్ద నాటికలు ప్రదర్శన ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు 8 నాటికలు ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రేక్షకులు ఈనాడు విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో మానాపురం సత్యనారాయణ, మేడికొండ శ్రీనివాస్, కొల్లి కొండ ప్రసాద్, డాక్టర్ వర్మ, పీర్ సాహెబ్, రెడ్డి వాసు, నడపన శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు
వచ్చేనెల 13 నుంచి పాలకొల్లు కళా పరిషత్.
ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న దృశ్యం