Telugu News Power

వచ్చేవారం పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్ళు – రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి, భూపతిరాజు శ్రీనివాస వర్మ.

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రైల్వే డి ఆర్ సి సభ్యులు జక్కంపూడి కుమార్

పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్.కామ్)
నర్సాపురం(07219/07220)నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) మరియు బెంగళూరు(07153/07154) (ఎస్ఎంవిబి,) వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వే వారు రద్దు చేశారన్న వార్త ఉభయగోదావరి జిల్లాలో ఆదివారం దావానలంలా వ్యాపించింది. స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ రైళ్ళు కొనసాగించడానికి గతంలో రైల్వే అధికారులతో పలుసార్లు సమావేశమయ్యారు. వారి హామీతో ఈ రైళ్ళు ఇక నిరాగాటంగా నడుస్తాయని మంత్రి సంతోషంగా ప్రకటించారు. ఇంతలోనే, రైల్వే శాఖ పిడుగు లాంటి వార్త ప్రయాణికుల మీద వేసింది. ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ఈ రైళ్ళు శాశ్వతంగా రద్దు చేయడానికి రైల్వే శాఖ పూనుకుంది. కేరళలో జరుగుతున్న ఎన్నికల భారాన్ని భుజాలకెత్తుకున్న కేంద్రమంత్రి వర్మకు, క్షణం తీరిక లేని పరిస్థితి. అయినప్పటికీ, డి ఆర్ యు సి సి సభ్యులు జక్కంపూడి కుమార్ ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన కేంద్రమంత్రి, రైల్వే అధికారులతో సంప్రదింపులు జరిపారు. చర్చలు ఫలవంతం కావడంతో, మరో రెండు నెలల పాటు కొనసాగించటానికి, రైల్వే శాఖ పచ్చ జెండా ఊపింది. వచ్చేవారం ఈ రైళ్ళు పట్టాలలెక్కనున్నాయి. కేంద్ర మంత్రి వర్మ స్వయంగా ఈ విషయాన్ని జక్కంపూడి కుమార్ ద్వారా తెలియజేశారు. వీటిని శాశ్వత ప్రాతిపదికన నడిచేందుకు కృషి చేస్తామనని మంత్రి హామీ ఇచ్చినట్టు కుమార్ తెలిపారు.

నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి అందుకు తగినట్టుగా రైళ్లను నడపటానికి, ఈ ప్రాంత అభివృద్ధికి, నిరంతరం కృషి చేస్తున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కు ప్రజల తరఫున జక్కంపూడి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.