Telugu News Power

వరిపైరుకు జింకు లోపం, సల్ఫేడ్ ఇంజురీ- మంత్రి నిమ్మల పొలం బాటలో వెల్లడి.

వ్యవసాయ అధికారులతో కలిసి వరిచేలు పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: జనవరి,
26(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుతం సాగు చేస్తున్న దాల్వా వరి పైరుకు జింకు లోపం, సల్ఫేడ్ ఇంజురీ ఉన్నట్టు వ్యవసాయ అధికారులు గుర్తించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, వ్యవసాయ క్షేత్రాల్లో, అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. ఆగర్తిపాలెంలో ఉన్న వరి పొలాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పైరు పై ప్రభావం చూపుతుందన్నారు. రైతులు జింకు లోపం నివారణకు ఎకరాకు లీటరుకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి, 15 ట్యాంకులు పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ విధంగా ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలని, ఏ విధమైన పురుగు మందులు వీటితో కలిపి పిచికారి చేయరాదని హెచ్చరించారు.
గడ్డి కుళ్ళు వల్ల సల్ఫయిడ్ ఇంజురీ కనిపిస్తుందని, ఇందుకు నివారణగా వరి చేలు ఆరగట్టి, నీళ్లు పెట్టుకోవాలని సూచించారు. మంత్రి పర్యటనలో, మార్టేరు వ్యవసాయ పరిశోధన క్షేత్రం, శాస్త్రవేత్తలు, శ్రీనివాస్, గిరిజారాణి, భువనేశ్వరి, మల్లికార్జున రావు, ఏ డి ఏ మురళీకృష్ణ, ఏ ఓ రాజశేఖర్, సొసైటీ అధ్యక్షులు జాన్ రాజు, రైతులు పాల్గొన్నారు.