Telugu News Power

వాటర్ ప్లాంట్ వాడుకలోకి తీసుకువస్తా – మంత్రి నిమ్మల

బగ్గేశ్వరం ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) బగేశ్వరంలో మూసివేసిన వాటర్ ప్లాంట్ తిరిగి వినియోగంలోకి తెస్తానని మంత్రి హామీ ఇచ్చారు. స్థానిక మండలం బగ్గేశ్వరం గ్రామంలో పునరుద్ధరిస్తున్న మైక్రో వాటర్ ఫిల్టర్ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిధులు లేని తీవ్రంగా ఉన్నప్పటికీ బెగ్గేశ్వరం గ్రామం పై ఉన్న ప్రత్యేక అభిమానం గౌరవంతో ఈ నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు సుమారు పది లక్షల వ్యయంతో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మూసివేసిన వాటర్ ప్లాంట్ మళ్ళీ పనిచేసే విధంగా సి ఎస్ ఆర్ నిధులు తెచ్చి కొత్త యంత్ర సామాగ్రి సమకూర్చి మళ్లీ జల వితరణ కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు దేవసేన మార్కెట్ కమిటీ అధ్యక్షులు కోడి విజయభాస్కర్, పలువురు స్థానిక నాయకులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బగ్గేశ్వరం లో రక్షిత మంచి నీటి పథకం పనులకు శంకుస్థాపన