Telugu News Power

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి బంగారు మకర తోరణం బహుకరణ.

వాడపల్లి వెంకటేశ్వర స్వామికి సమర్పించిన బంగారు మకర తోరణం

ఆత్రేయపురం: మార్చి ,7 (తెలుగు న్యూస్ పవర్.కాం)
కోనసీమ తిరుమలగా, ఏడువారాల వెంకటేశ్వర స్వామిగా వాడపల్లి లో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తణుకు వాస్తవ్యులు పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి, సావిత్రి పుణ్య దంపతులు సుమారు 350 గ్రాముల బంగారంతో, సుమారు రూ.60 లక్షల విలువగల మకర తోరణం తయారు చేయించి సమర్పించారు.

ఈ మకర తోరణాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన సంప్రోక్షణ కార్యక్రమం తరువాత స్వామివారికి మకర తోరణాన్ని అలంకరించారు.