పాలకొల్లు: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక 27 వార్డు వైసిపి కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు అధ్యక్షత వహించారు పార్టీ సంస్థాగత బలోపేతం గురించి చర్చించారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావడానికి వ్యూహాలు పై సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో, వైఎస్ఆర్సిపి ప్రముఖ సీనియర్ నాయకులు అడ్డాల నారయ్యను స్థానిక వార్డు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సమావేశంలో పెదగోపురం మాజీ చైర్మన్ కోరాడ శ్రీనివాస్, జోగాడ ఉమామహేశ్వరరావు, పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్డు అధ్యక్షులుగా అడ్డాల.
నారయ్యకు ఎంపికపత్రం అందిస్తున్న
గోపి.