Telugu News Power

వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి.

వినియోగదారుల వారోత్సవాల్లో పాల్గొన్న ప్రిన్సిపల్, రిసోర్స్ పర్సన్ లు, అధ్యాపకులు

పాలకొల్లు:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని ప్రిన్సిపల్ టి. రాజా రాజేశ్వరి పిలుపునిచ్చారు. స్థానిక అద్దెపల్లి
సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో వినియోగదారుల వారోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ pసందర్భంగా,అధ్య క్షోపన్యాసం చేస్తూ, వినియోగదారుల రక్షణ కోసం 2019లో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మోసాలు, అక్రమాల గురించి, నాసిరకం సరుకులు,సేవలపై నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నదన్నారు. రిసోర్స్ పర్సన్ హాబీబ్ సుల్తాన్ ఆలీ తన ప్రసంగంలో చట్టం ప్రకారం వినియోగదారులకు భద్రత, సమాచారం పొందే హక్కు, పరిహారం పొందే హక్కు వంటి మౌలిక హక్కులు కల్పించబడ్డాయన్నారు. ఇప్పుడు ఫిర్యాదు ప్రక్రియ మరింత సులభ తరం చేశారన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ కొనుగోలు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వైద్య సేవలు వంటి రంగాల్లో వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అధిక ధరలు వసూలు చేయడం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఈ చట్టం కల్పిస్తున్నదన్నారు. వి.నాగరాజు మాట్లాడుతూ వినియోగదారులు సమస్యలను ఈ – దాఖిల్ పోర్టల్ ద్వారా, టోల్ ఫ్రీ నెంబర్ 1915 ద్వారా నమోదు చేయవచ్చునన్నారు. వారోత్సవాల ద్వారా వినియోగదాలకు అవగాహన కల్పించడం వల్ల వారు నాణ్యమైన వస్తువులు, మెరుగైన సేవలు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. సమాజ సేవలో భాగంగా విద్యార్థులు వినియోగదారులకు చట్టంపై అవగాహన కల్పించాలని కోరారు. కళాశాల వాణిజ్య విభాగం, కన్జ్యూమర్ క్లబ్, ఐ క్యూ ఏ సి, ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు టి కృష్ణ, కే.భద్రాచలం, ఎం .రామకృష్ణ, వి విజయలక్ష్మి, దుర్గేశ్వరి, ఆశాజ్యోతి,స్వర్ణలత, మన్మధరావు, రీసెర్చ్ స్కాలర్లు తదితరులు పాల్గొన్నారు.