Telugu News Power

వినియోగదారుల వారోత్సవాలు ముగింపు.

బహుమతులు అందుకుంటున్న విద్యార్థులు

పాలకొల్లు: డిసెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్). స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో వినియోగదారుల ముగింపు ఉత్సవాలు మంగళవారం జరిగాయి. ఈ వారోత్సవాలు ఈనెల 17న ప్రారంభమై 23 తో ముగిసాయి. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ, వినియోగదారులు తమ హక్కులు బాధ్యతలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల వినియోగదారులను ముంచెత్తుతున్న, కన్జ్యూమెరిజం నుంచి కొంతవరకు బయటపడవచ్చునన్నారు. విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. వివిధ విభాగాలు విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టి కృష్ణ, కే భద్రాచలం, పి దుర్గేశ్వరి, బి ఆశాజ్యోతి, డి మన్మధరావు, కే స్వర్ణలత, పి శ్రీనివాస్ ఎం దివ్య తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.