విశాఖపట్నం: మార్చి ,21 (తెలుగు న్యూస్ పవర్. కాం)
విశాఖపట్నంలోని సాగర్ నగర్–ఎండాడ సమీపంలో ప్రతిష్టాత్మక హయత్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శనివారం భూమి పూజ చేశారు. స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం నిర్మించబోతున్న,
రూ.250 కోట్ల భారీ పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హోటల్, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుని వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన సీఐఐ సమ్మిట్ ఫలితంగా కుదిరిన పెట్టుబడులు నేడు కార్యరూపం దాల్చడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమన్నారు.
విశాఖపట్నం వేగంగా ‘గ్లోబల్ సిటీ’గా ఎదుగుతున్న ఈ తరుణంలో, హయత్ వంటి అంతర్జాతీయ హోటల్ రాకతో పర్యాటక రంగానికి మరింత ఊతం చేరుతుందన్నారు. ప్రపంచ స్థాయి వసతులు, ఆధునిక కాన్ఫరెన్స్ హాళ్లు, ఫైన్ డైనింగ్ సదుపాయాలతో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి అలాగే విశాఖ నగర అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు

అయత్ హోటల్ హోమ్ పేజీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

హయత్ ప్రతినిధులతో మంత్రి కందుల దుర్గేష్