పాలకొల్లు: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) గ్రామీణ ఉపాధి, స్వయం సమృద్ధి లక్ష్యంగా వి.బి- జి రామ్ జి పథకం అమలు జరుగుతుందని, బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, స్థానిక మార్కెట్ కమిటీ, మాజీ చైర్మన్ ఉన్నమట్ల కపర్థి, శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ పథకం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40, నిధులతో పనులు చేయబడతారని తెలిపారు. రైతు, కూలీలు ఇరువురికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో, ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి, మరియు జీవనోపాధి హామీ పథకం, 125 రోజుల వరకు పని దినాలు కల్పిపిస్తుందన్నారు. గతంలో ఈ పథకం, తప్పుదారి పట్టి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యిందన్నారు. నూతన పథకంలో, అత్యంత ఆధునిక సాంకేతికతతో, అవినీతికి తావు లేకుండా పకడ్బందీగా ఈ పథకం అమలు జరుగుతుందన్నారు. ఈ పథకం గురించి కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కపర్తి తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి, ముందు చూపుతో, 2047 వికసిత్ భారత్, వైపు అడుగులు వేస్తున్న అభివృద్ధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.
వి బి- జి రామ్ జి పనులతో గ్రామాలకు మేలు.
బిజెపి మీడియా అధికార ప్రతినిధి కబర్ది