యలమంచిలి:డిసెంబర్,12
(తెలుగు న్యూస్ పవర్) తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గ్రామ రెవెన్యూ సహాయకులు చలో అమరావతి ఆందోళన చేపట్టారు. ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు అమరావతి చేరుకొని, నిరసన వ్యక్తం చేయనున్నట్లు యలమంచిలి మండల వీఆర్ఏల సంఘ అధ్యక్షులు కొమ్మిరెడ్డి రామకృష్ణ స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద శుక్రవారం తెలిపారు. ఈ మేరకు వీఆర్ఏలు సంతకాలు సేకరించి తహసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ కు మెమోరాండం అందజేశారు. వి ఆర్ ఏ లు అందరికీ పే స్కేల్ తెలంగాణ రాష్ట్రంలో మాదిరి ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న అందర్నీ వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులు అందరికీ ప్రమోషన్లలో 70% వాటా కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏల కార్యదర్శి మట్టపర్తి నరసింహారావు, ట్రెజరర్ కోన నారాయణ, మండలంలోని దాదాపు 49 మంది వీఆర్ఏ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీఆర్ఏల చలో అమరావతి.
మేమోరాండం సంతకాలు సేకరిస్తున్న విఆర్ఏలు.