పాలకొల్లు: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ నిర్ణయం పై ప్రభుత్వానికి, స్థానిక శ్రీ వెంకటేశ్వర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. స్థానిక సంఘ కార్యాలయ భవనంలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో హర్షం ప్రకటించారు. ఈ సమావేశానికి పెచ్చెట్టి బాబ్జి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు చొరవతో, కార్మిక శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ కృషి వల్ల బోర్డు మళ్లీ జీవం పోసుకోవడం తమకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. కార్మికుని సహజమరణానికి 60 వేల రూపాయలు, పిల్లల వివాహానికి 40 వేల రూపాయలు, ప్రతి పురుసూతి సాయం 20 వేల రూపాయలు, అంత్యక్రియలకు 20వేల రూపాయలు అందించాలని, తీసుకున్న నిర్ణయం పట్ల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగి, శాశ్వతంగా పని చేయలేని కార్మికుల గురించి, ఏ విధమైన ప్రస్తావన ఈ నిర్ణయం లో లేదన్నారు. మునుపటి. క్లైమ్ ల గురించి , కార్మికుల ప్రమాద మరణానికి సంబంధించి ఇవ్వవలసిన సహాయం గురించి గానీ పేర్కొనలేదన్నారు. వీటిపై వెల్ఫేర్ బోర్డ్ అధ్యక్షులు వలవల బాబ్జి ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో, గౌరవాధ్యక్షులు, పులపర్తి సర్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అడబాల శ్రీ రామకృష్ణ, ఉపాధ్యక్షులు రాజా భక్తతుకారం, నర్రెరెడ్డి శివ, రాంపండు, నగేష్, ముల్లుల వెంకటేశ్వరరావు, బండి ఆంజనేయులు, మైలవరపు నాని, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ పై కార్మికలోకం హర్షం.
శ్రీ వెంకటేశ్వర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు