Telugu News Power

వేప చెట్టుకు ఏమైంది?

వసంతకాలంలో వాడిపోయిన వేప చెట్టు

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) హిందువులకు నా మాటకొస్తే అన్ని మతాల వారికి ఎంతో ముఖ్యమైన ఔషధ వృక్షం. వేప చెట్టుకు, రావి చెట్టుకు వివాహం చేస్తే పిల్లలు పుడతారని కూడా హిందువుల నమ్మకం.చెట్టు ఆకులు, గింజలు, కలప అన్ని ఉపయోగకరమైనవి. ఆయుర్వేదంలో ఈ చెట్టు ఆకులకు ఎంతో విశిష్టత ఉంది. అనేక శారీరక రుగ్మతలకు పూతగా వాడతారు. చక్కెర వ్యాధికి లేచిగుళ్ళు తింటారు. అమెరికాలో దంత దావణానికి వాడే వేప పుల్ల ఖరీదు 75 రూపాయలు. ఇది చేదు రుచి కలిగి ఉంటుంది. తిరుమలను సంహరిస్తుంది. వసంతకాలంలో వేపపూత మంచి సువాసనలు ఇస్తుంది. ఉగాదికి షడ్రుషులలో ముఖ్యమైనది చేరుగలిగిన వేప పూత. ఇప్పుడిది కనపడకుండా పోయింది. చాలా వ్యాపృక్షాలకు వైరస్ కి ఆకులు మాడిపోతున్నాయి. “ఫోమాప్సిస్ అజాడిరక్ట్” అనే సిలింద్రం వల్ల ఇది తెగులు సోది నట్టు చెబుతున్నారు. ఈ ఫంగస్ వల్ల ఈ వ్యాధి తక్షణమే తగ్గే అవకాశం లేదని వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ వెల్లడించారు. అందరి తెగుళ్లు మాయం చేసే, వేప చెట్టుకి మాయ రోగం రావడం విధి విచిత్రం.